మహారాష్ట్రలోని ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో కొడుకు పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుమారుడిని వెతుక్కుంటూ పొలం వెళ్లిన తండ్రి.. బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి అదే ఉరి తాడు తగిలించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నాందేడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల ఓంకార్ తన తండ్రి ఫోన్ కొనివ్వలేదని ఉరివేసుకున్నాడు.