ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే ఇటీవల క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దానిపై సోనాలి మీడియాతో మాట్లాడారు. తన గురించి తప్పుడు ప్రచారాలు జరగడం ఇష్టం లేకపోవడంతో.. తానే స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని బయటపెట్టానని బింద్రే తెలిపింది. కాగా ఆమె ఏడాది పాటు చికిత్స తీసుకుని ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత వివిధ షోలలో పాల్గొంటున్నారు. ఇక ఆమె తెలుగులో మహేశ్ బాబు, నాగార్జున, చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో నటించారు.