నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీటులో కాంగ్రెస్ కీలక నేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. బ్రష్ట్ జుమ్లా పార్టీ BJPకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుందని అన్నారు. 'దేశంలో కాంగ్రెస్ ఎదుగుదలను జీర్ణించుకోలేక పోతోంది. అందుకే CBI, EDలను సొంత ఏజెన్సీలుగా వాడుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తోంది. BJP చేస్తున్న నీచ రాజకీయాలకు, ప్రతీకార చర్యలకు ఇది నిదర్శనం' అని షర్మిల అన్నారు.