పెళ్లి చేయలేదని తండ్రిని కొట్టిన కొడుకులు

81చూసినవారు
ఏపీలో దారుణం జరిగింది. పెళ్లి చేయడం లేదని కన్న తండ్రిపై కొడుకులు దాడి చేశారు. కర్నూలు జిల్లా గోనెంగండ్ల మండలంలో మంతరాజు(65) అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, మరో ముగ్గురికి వివాహం చేయలేదు. 40 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడంతో మంతరాజును కొడుకులు నీలకంఠ, జగదీష్ బంధించి విచక్షణారహితంగా కట్టెలతో కొట్టారు. మంతరాజు అరుపులు విని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్