ప్రముఖ నటుడు సోనుసూద్‌కు లుథియానా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోను స్పందించారు. విషయం సూటిగా చెప్పాలంటే తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని, మా న్యాయవాదులు కోర్టుకు సమాధానమిచ్చారని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఫిబ్రవరి 10న వెల్లడిస్తానని, మీడియా అనవసరంగా ఈ కేసుపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ఇలా సెలబ్రెటీలను టార్గెట్ చేయడం బాధకరమని వ్యాఖ్యానించారు.