కర్ణాటకలో 30 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు ప్రేతాత్మ పెళ్లి చేయడానికి ఇష్టమైతే సంప్రదించండి అంటూ ఫోన్ నంబర్ తో ఒక ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన వైరల్ అవ్వడంతో 50 మంది స్పందించారని ప్రకటన ఇచ్చిన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రేతాత్మ వివాహా తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని అన్నారు. ఈ యాడ్ వైరల్ అవ్వడంతో నెట్టింట ట్రోల్ చేస్తారని బయపడ్డారట. కానీ ఆశ్చర్యకరంగా ఈ ఆచారంపై అవగాహనకు ఈ ప్రకటన కారణమైంది.