తమిళ నటుడు విజయ్ సేతుపతి అభిమానులకు క్షమాపణ చెప్పారు. తాజాగా సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఫీనిక్స్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో సూర్య ప్రవర్తనతో సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వచ్చాయి. దీంతో విజయ్ స్పందిస్తూ.. తన కొడుకు చేసిన పనికి క్షమించాలని కోరారు. ఇది ఎవరు చేశారో తెలియదని, ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించాలన్నారు.