TG: ఇటీవల కాలంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలవరపెడుతోంది. తాజాగా హైదరాబద్ ఉప్పల్‌లోని ఓ స్కూల్లో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. క్లాస్ రూమ్ లోని CCTV డైరెక్షన్‌ను మార్చడంతో 8వ తరగతి బాలుడు సంగారెడ్డి(13)ని పీఈటీ మందలించి కొట్టాడు. క్లాస్ టీచర్ కూడా తిట్టింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు నోట్ బుక్‌లో 'సారీ మదర్.. ఐ విల్ డై టుడే' అని రాసి పాఠశాల భవనంపై నుంచి దూకేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచాడు.