అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మార్షల్‌లాను తెరపైకి తీసుకురావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సౌదీ అరేబియా రాయబారిగా పనిచేస్తున్న చోయ్ బైంగ్ హ్యూక్‌కు నూతన రక్షణమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.