ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఎస్.పి. సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. తండ్రి కోరిక మేరకు జేఎన్‌టియు ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పటికీ, టైఫాయిడ్ కారణంగా చదువు ఆగిపోయింది. 1964లో మద్రాస్‌లో అమెచ్యూర్ గాయకుల పోటీలో మొదటి బహుమతి గెలిచారు. సంగీత దర్శకుడు కోదండపాణి ఆయన ప్రతిభను గుర్తించి.. 1966లో "శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న" చిత్రంతో సినీ గానంలో అవకాశం ఇచ్చారు.