ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. ఈ యాత్రలో ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే విధంగా మొత్తం 8 రోజుల ప్రణాళిక రూపొందించారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 8వ తేదీ వరకు సాగుతుంది. సూపర్ లగ్జరీకి రూ.8,000, స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్‌కి రూ.11,000, వెన్నెల ఏసీ స్లీపర్‌కి రూ.14,500 ఛార్జీలు ఉంటాయి.