తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు 10 మంది IAS అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. HYD బాధ్యతలను GHMC కమిషనర్ ఆమప్రాలికి అప్పగించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలను సురేంద్ర మోహన్, ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఇలంబర్తి, కరీంనగర్‌కు ఆర్వీ కర్ణన్, నల్గొండకు అనితా రామచంద్రన్, రంగారెడ్డికి దివ్య, నిజామాబాద్‌కు శరత్, మహబూబ్‌నగర్‌కు రవి, వరంగల్‌కు వినయ్ కృష్ణారెడ్డి, ఉమ్మడి మెదక్‌కు హరిచందనను నియమించింది.