శ్రావణమాసం వచ్చేసింది. హిందువులు ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. అలాగే ఈ మాసమంతటా పండుగల సందడితోనే సాగుతుంది. నాగ పంచమి/గరుడ పంచమి(ఆగస్టు 9)తో ఆరంభమైన పర్వదినాలు మాసం చివరి రోజైన పొలాల అమావాస్య(సెప్టెంబర్ 2)తో ముగుస్తాయి. ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 26న కృష్ణాష్టమితో పాటూ బలరామ జయంతి, హయగ్రీవ జయంతి, రాధాష్టమి పండుగలు జరుపుకుంటారు.