శనివారం మే 17న తిరిగి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2025 కోసం కొంతమంది ఆస్ట్రేలియన్లను మినహాయించి చాలా మంది విదేశీ ఆటగాళ్ళు తిరిగి రానున్నారు. SRHలోకెప్టెన్ కమ్మిన్స్, ఓపెనర్ ట్రావిస్ హెడ్ తిరిగి రావడానికి అంగీకరించారని సమాచారం. మే 19న లక్నోలో LSGతో, మే 25న ఢిల్లీలో KKRతో జరిగే మ్యాచ్ లలో వారు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ 2 లీగ్ మ్యాచ్‌ల తర్వాత కమిన్స్, హెడ్ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోనున్నట్లు సమాచారం.