ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. SRH స్టార్ బ్యాటర్ నితీశ్ కుమార్ 32 పరుగులకు ఔటయ్యారు. దీంతో 72 పరుగుల నితీశ్-ఇషాన్ భాగస్వామ్యానికి తెరపడింది. 14వ ఓవర్లో రాజస్థాన్ బౌలర్ మహీష తీక్షణ వేసిన రెండో బంతికి జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ పెవిలియన్ చేరారు. దీంతో క్రీజులోకి హెన్రిచ్ క్లాసెన్ వచ్చారు. ప్రతుతం 15 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 208/3గా ఉంది.