శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగు కవిత్వంలో "శ్రీశ్రీ"గా ప్రసిద్ధి చెందిన మహాకవి, 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి పూడిపెద్ది వెంకట రమణయ్య, తల్లి ఆప్పలకొండ. శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోవడంతో ఇంటిపేరు శ్రీరంగం అయింది. నెలల వయసులో శ్రీశ్రీకి పెద్ద జబ్బు వచ్చింది. ఏడాదిన్నర వయసులో తల్లి మరణించగా, తండ్రి సుభద్రమ్మను 2వ పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆలనాపాలనలో శ్రీశ్రీ పెరిగారు.