AP: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ హుండీలను సోమవారం అధికారులు లెక్కించారు. దాదాపు 17 రోజుల్లోనే ఆలయానికి రూ.2.18కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 16 వరకు హుండీల ద్వారా రూ,2,18,94,668 నగదు వచ్చిందని ఆలయ ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కింపు చేపట్టినట్లు వివరించారు.