శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతున్న వరద (వీడియో)

0చూసినవారు
ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 1,30,789 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి ఔట్‌ఫ్లో 67,019 క్యూసెక్కులుగా ఉంది.శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 175.10 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ఎడమ, కుడి జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్