AP: శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. క్షేత్రంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు శివ సేవకులు ఉభయ దేవాలయాలతో పాటు పరిహార దేవాలయాల హుండీలను లెక్కించారు. అయితే 22 రోజుల్లో రూ. 2.59 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. హుండీల్లో 64 గ్రాముల బంగారం, 3 కేజీల 170 గ్రాముల వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీ ఉందని ఈఓ ఎం. శ్రీనివాస రావు వెల్లడించారు.