తిరుపతి స్థానికులకు ఫిబ్రవరి 11న శ్రీవారి దర్శనం కోసం ఈనెల 9న టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. 4న రథసప్తమి నేపథ్యంలో ఫిబ్రవరిలో స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని మొదటి మంగళవారం నుంచి రెండో మంగళవారానికి మార్చిన సంగతి తెలిసిందే.