UPలోని కౌశాంబి జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. మంజన్‌పూర్ ప్రాంతంలోని జనసేవా ఆసుపత్రిలో సోనమ్ అనే యువతి స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. ఆమెపై ఆసుపత్రి నిర్వాహకుడు రమేష్ గురువారం దారుణంగా ప్రవర్తించాడు. నైట్ డ్యూటీలో ఉన్న ఆమె వద్దకు వచ్చి దుర్భాషలాడాడు. అంతేకాకుండా కనికరం లేకుండా సోనమ్‌పై దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.