TG: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే మంత్రి కొండా సురేఖ కోసం కొంతసేపు కార్యక్రమాన్ని నిలిపివేశారు. అనంతరం మంత్రి రావడంతో ఒక్కసారిగా నిరుద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.