కుంభమేళాలో తొక్కిసలాట.. యూపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

83చూసినవారు
కుంభమేళాలో తొక్కిసలాట.. యూపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. 'మహా కుంభమేళాలో తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం, గాయాలపాలవడం చాలా బాధాకరం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. పాలనా యంత్రాంగం సాధారణ భక్తుల గురించి కాకుండా.. వీఐపీల తరలింపుపై ఎక్కువ దృష్టిపెట్టడమే ఈ ఘటనకు కారణం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి విషాదకర ఘటనలు పునారావృతం కాకుండా చూడాలి' అని సూచించారు.

సంబంధిత పోస్ట్