బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఆర్సీబీ, బీసీసీఐపై కర్ణాటక ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. సోషల్ మీడియా ద్వారా విజయోత్సవాల గురించి ప్రపంచం మొత్తం చాటింపు వేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని ఆరోపించింది. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, కేవలం తమ ప్రణాళిక గురించి సమాచారం మాత్రమే ఇచ్చారని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.