బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే అమ్మ కాబోతుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే, తల్లి కాబోతున్న విషయాన్ని ఇప్పటివరకు ఆమె గోప్యంగానే ఉంచింది. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012 లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కానున్నడంతో అభిమానులు సంతోషంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.