'కూల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం.. తూకానికి అమ్మే పనిలో కేంద్రం'

75చూసినవారు
'కూల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం.. తూకానికి అమ్మే పనిలో కేంద్రం'
TG: కాంగ్రెస్‌, బీజేపీకి ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధి, ఆకాంక్షలు వారికి పట్టవు అని అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయరని, ఆదిలాబాద్‌ సీపీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడతారని తెలిపారు. కొత్త పరిశ్రమలు కావాలని.. ఉన్న పరిశ్రమలు ఉంచాలని అడగట్లేదని మండిపడ్డారు. కూల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే.. తూకానికి అమ్మే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్