TG: భూ లావాదేవీలను సమర్దవంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కర్నాటకలో అమలవుతున్న లైసెన్స్‌డ్ సర్వేయర్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు తెలిపారు. 5 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని, ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు.