అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు తగ్గి 75,967 వద్ద ముగిసింది. నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 22,945 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.96 వద్ద స్థిరపడింది.