దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఫ్లాట్‌గా కొనసాగింది. సెన్సెక్స్ 8 పాయింట్లు పెరిగి 82,438.49 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 25,127.20 వద్ద ట్రేడ్ అవుతుంది. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గైనర్స్ కాగా, ఏషియన్ పెయింట్స్, ICICI బ్యాంక్ నష్టపోయాయి. IT, మీడియా రంగాల్లో లాభాలు, రియల్టీ, బ్యాంకింగ్ రంగాల్లో నష్టాలు నమోదయ్యాయి.