సెలవు దినం రోజున స్టాక్ మార్కెట్ ఓపెన్

సాధారణంగా స్టాక్ మార్కెట్లు శనివారాల్లో మూసివేసి ఉంటాయి. కానీ రేపు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సెలవు రోజైన శనివారం భారత స్టాక్ మార్కెట్లు తెరిచి ఉంటాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (-NSE) జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 1న స్టాక్‌మార్కెట్ ఉదయం 9.15 గంటలకు తెరచుకొని మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తుంది. అలాగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా ట్రేడింగ్‌కి అందుబాటులో ఉండనుంది.