దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రభావంతో విమానయాన రంగ షేర్లలో తీవ్ర నష్టాలు చోటుచేసుకున్నాయి. సెన్సెక్స్ 823 పాయింట్ల నష్టంతో 81,691.98 వద్ద ముగియగా, నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 24,888 వద్ద నిలిచింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.60గా నమోదైంది.