స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
By Pavan 60చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి.
సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో 82,515.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభపడి 25141 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో HCL టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్‌ఫిన్‌సర్వ్, ICICI బ్యాంక్, టాటా మోటార్స్, ఎటర్నల్, టైటాన్, టాటా స్టీల్, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి.