దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 310 పాయింట్ల లాభంతో 75,676 వద్ద.. నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 22,899 వద్ద ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, HDFC బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జొమాటో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, NTPC, మారుతీ సుజుకీ, ITC, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.