దేశీయ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 79,980 వద్ద.. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 24,352 వద్ద ట్రేడవుతున్నాయి. టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, టైటన్ షేర్లు లాభాల్లో.. సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్, HUL, నెస్లే ఇండియా నష్టాల్లో ఉన్నాయి.