కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆదివారం కేరళలోని వయనాడ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక పాఠశాల భవనం శంకుస్థాపన చేసే ముందే శిలాఫలకం పగిలిపోయింది. దీంతో ప్రియాంక గాంధీ, అక్కడ ఉన్న నేతలు నిరాశకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.