షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ అంటేనే జనాలు ఎగబడతారు. అదే ఒకవేళ నచ్చిన వస్తువును ఫ్రీగా పట్టుకెళ్లండని ఎవరైనా ఆఫర్ ఇస్తే? ఊరుకుంటారా? ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో అదే జరిగింది. బాక్సింగ్ డే సందర్భంగా ఓ స్టోర్ ఓనర్.. తన షాపులో ఏ వస్తువు అయినా ఫ్రీగా తీసుకెళ్లొచ్చు అని ఆఫర్ పెట్టాడు. దీంతో జనం ఒక్కసారిగా స్టోర్‌లోకి ప్రవేశించి మొత్తం ఖాళీ చేశారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.