ఆ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఓ వింత ఆచారం కొనసాగుతుంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని హున్సా గ్రామం హోలీ సందర్భంగా పిడిగుద్దులాటతో ప్రసిద్ధి చెందింది. గ్రామ శ్రేయస్సు కోసం దశాబ్దాలుగా కుల, మత, వయస్సు బేధం లేకుండా ఐక్యంగా ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, గ్రామస్తులు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.