భోపాల్‌లో వింత రైల్వే వంతెన!

67చూసినవారు
భోపాల్‌లో వింత రైల్వే వంతెన!
భోపాల్‌లోని ఐష్‌బాగ్ సమీపంలో నిర్మించిన రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ అధికారికంగా ప్రారంభించకముందే చర్చనీయాంశంగా మారింది. ఇది విచిత్రంగా 90డిగ్రీల మలుపు ఉండటమే కారణం. వంతెన నిర్మాణానికి భూమి కొరత ఎదురుకావడం, సమీపంలోనే మెట్రో స్టేషన్ ఉండటంతో ఈ విధంగా నిర్మించక తప్పలేదని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా 3లక్షల మంది ప్రయోజనం పొందుతారని తెలిపారు. కానీ ఈ మలుపు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్