పుదీనా పేస్టులో కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇది చుండ్రును తొలగించి జుట్టును బలంగా మార్చుతుంది. పుదీనా నూనెను జుట్టు చివర్లకు రాసుకుంటే చిట్లడాన్ని నివారించవచ్చు. జుట్టు వేర్లకు పుదీనా నూనె రాయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో తల చల్లబడుతుంది. అంతేకాదు జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.