తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు CM రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై సీఎల్పీలో చర్చించారు. నేతలు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే.. కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. పార్టీ విధానాలపై అనుమానాలు ఉంటే.. అంతర్గతంగా చర్చించాలని సీనియర్ నేతలు సూచించారు.