తండ్రి మందలించాడని.. విద్యార్థిని ఆత్మహత్య

76చూసినవారు
తండ్రి మందలించాడని.. విద్యార్థిని ఆత్మహత్య
TG: హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్ కు చెందిన రాజేష్ కుమార్ రెండవ కుమార్తె తేజస్విని(19) గౌతమి కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఈ మధ్య తరుచూ ఫోన్ మాట్లాడుతుండడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్