గురుకులంలో సీటు రాలేదని విద్యార్థిని సూసైడ్

22చూసినవారు
గురుకులంలో సీటు రాలేదని విద్యార్థిని సూసైడ్
TG: నారాయణపేట జిల్లా దమ్‌గాన్‌పూర్‌కు చెందిన నర్సప్ప, లక్ష్మి దంపతులకు కుమార్తె మనీషా (14) మద్దూరు బాలికల పాఠశాలలో 9వ తరగతి అడ్మిషన్‌ పొందింది. గురుకుల పాఠశాలలో సీటు కోసం ఎంట్రన్స్‌ రాసింది. పరిగి గురుకుల పాఠశాలలో సీటు వచ్చిందని టీసీ తీసుకొని వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక అక్కడ సీటు రాలేదని తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన మనీషా 2వ తేదీ రాత్రి పురుగుమందు తాగగా.. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందింది.

సంబంధిత పోస్ట్