మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య

57చూసినవారు
మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ హాస్టల్‌లో ఉంటున్న 18 ఏళ్ల అమ్మాయి హాస్టల్ గదిలో ఉరేసుకొని చనిపోయింది. ఇటీవల విడుదలైన JEE మెయిన్స్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని 12వ తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు సంఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘మమ్మీ, పాపా నన్ను క్షమించండి. మీరు నన్ను ఎంతో ప్రేమించారు కానీ మీ ఆశలను నెరవేర్చలేకపోయాను’ అని విద్యార్థిని అందులో రాసింది.

సంబంధిత పోస్ట్