AP: లవ్ బ్రేకప్ కావడంతో పంట పొలాల్లో మద్యం తాగి ఓ విద్యార్థిని డ్యాన్స్ చేసింది. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన ఒక యువతి లవ్ బ్రేకప్ కావడంతో యువకునితో కలిసి మద్యం తాగింది. మత్తులో కూరుకుపోయింది. ఆమెను ఇంటికి తీసుకువెళ్లడం వారి వల్ల కాలేదు. అదిచూసిన మరో వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. మత్తులోనే ఉన్న ఆమె స్టేషన్‌లో సిబ్బందిపైనా వీరంగం సృష్టించింది. చివరకు తల్లిదండ్రులను పిలిచి ఆమెను అప్పగించారు.