రన్నింగ్‌ బస్సు ఎక్కుతూ.. చక్రాల కింద పడి విద్యార్థిని మృతి (వీడియో)

78చూసినవారు
బెంగుళూరులో రన్నింగ్‌ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ చక్రాల కింద నలిగి తెలుగు విద్యార్థిని మౌనిక మృతి చెందింది. ఏపీలోని సత్యసాయి జిల్లా రోద్దం మండలానికి చెందిన మౌనిక బెంగుళూరులో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటోంది. కూడలి వద్ద ఆగి ఉన్న బస్సు ఎక్కేందుకు మౌనిక వెళ్తుడంగా గ్రీన్ సిగ్నల్ పడింది. రన్నింగ్‌లో బస్సును ఎలాగైనా అందుకోవాలనే ప్రయత్నంలో పరుగు తీసిన మౌనిక ఒక్కసారిగా బస్సు చక్రాల కింద పడి మృతి చెందింది.

సంబంధిత పోస్ట్