తరగతి గదిలో గుండెపోటుతో విద్యార్థిని మృతి (వీడియో)

54చూసినవారు
తమిళనాడులోని రాణిపేట నగరంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. క్లాస్ రూమ్ లో టీచర్ పాఠం చెబుతుండగా, బాలిక ఒక్కసారిగా తోటి విద్యార్థినిపైకి వాలిపోయింది. పాఠశాల యాజమాన్యం బాలికను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మొత్తం క్లాస్ రూమ్ లో ఉన్న సిసిటీవీలో రికార్డ్ కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్