స్కూల్ డుమ్మా కొట్టేందుకు ఓ విద్యార్థి రెండో అంతస్తులోని కిటికీ నుంచి బయటకు దూకాడు. దూకిన తర్వాత ఎవరు శబ్దం చేయొద్దంటూ చెప్పాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. దీనిని అక్కడే ఉన్న మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అదృష్టవశాత్తు అతడికి ఎలాంటి గాయాలు, ప్రమాదం జరగలేదు. క్లామ్‌గా లేచి చేతులు దులుపుకుని వెళ్లిపోయాడు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.