గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత

64చూసినవారు
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత
TG: జగిత్యాల జిల్లా కోరుట్లలోని గురుకుల పాఠశాలలో 11 మంది  విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తిన్న తర్వాత వారు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బాధితులను వెంటనే కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు వాంతులు, కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆహార నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్