కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందన్నారు. అయితే యూజీసీలో చేర్చకపోవడం వల్ల చదువు పూర్తి చేసుకుంటున్న వారికి ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్స్ ఇస్తారని విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు.