హైదరాబాద్ కోఠి మహిళా వర్సిటీ విద్యార్థినులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమ కాలేజీకి ఏదో ఒక పేరు ఫైనల్ చేయాలని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కోఠి ఉమెన్స్ కాలేజీకి తెలంగాణ మహిళా వర్సిటీ అని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాకలి ఐలమ్మ వర్సిటీగా మార్చారన్నారు. కానీ క్షేత్రస్థాయిలో జీఓ అమల్లోకి రాలేదన్నారు. ఈ కాలేజీలో చదువుతున్న తమకు గుర్తింపు లేదని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.